Design a site like this with WordPress.com
Get started

అమ్మ మాటలు, హార్వర్డ్‌ పాఠాల కంటే గొప్పవి!

కరోనా సమయంలో అమెరికా నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నడిపినందుకు నేను చాలా మంది దీవెనలు నేను అందుకున్నాను. ఓ తల్లి… రవి నా కొడుకు అని దీవించారు! ఇప్పుడు మా అమ్మ లేరు కానీ అలాంటి దీవెనలు నాకు చాలా సంతోషం ఇస్తాయి. ఎందకంటే, నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మే! హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ వంటి పెద్ద సంస్థల్లో చదువుకోకపోయినా… మా అమ్మ, నాన్న నేర్పిన పాఠాలు చాలా విలువైనవని నేనుContinue reading “అమ్మ మాటలు, హార్వర్డ్‌ పాఠాల కంటే గొప్పవి!”

అల వచ్చినప్పుడు తల వంచుకోవాలి

ఎప్పుడైనా నా కథని రాయల్సి వస్తే సక్సెస్‌ స్టోరీ కాకుండా నా ఫెయిల్యూర్‌ స్టోరీ రాద్దామనుకుంటాను. ఎందుకంటే విజయం… పొగరును అలవాటు చేస్తుంది. మన విజయాన్ని  అవతలివారు గుర్తించడం లేదన్న అసంతృప్తిని కూడా ఇస్తుంది. నిజమైన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కాబట్టే… నాకు జీవితకథలు చదవడం అంటే చాలా ఇష్టం. నిష్కర్షగా రాసిన జీవితకథలు ఎంతో నేర్పిస్తాయి. ఆదిభట్ల నారాయణదాసు జీవితకథనే తీసుకోండి. అన్ని కళల సమాహారం అయిన హరికథ ప్రక్రియకు పితామహుడే అయినా.. ఎంతోContinue reading “అల వచ్చినప్పుడు తల వంచుకోవాలి”

Software to Songs – కిట్టు విస్సాప్రగడ

అమ్మమ్మ చూపిన పాటల బాట.. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ రోజుకో కథ చెప్పిపడుకోబెట్టేది. పిల్లలు కథ చెపితే ఊ కొట్టి నిద్రపోయేవారు. కానీ నేను అలా కాదు… ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అనేవాడిని. అప్పుడు అమ్మమ్మ ఆ కథను ఓ పాటలా పాడి వినిపించేది. అది నాకు బాగా నచ్చేది. అప్పటి నుంచి నేను కూడా కథలను పాటల్లా చెప్పేందుకు ప్రయత్నించేవాడిని. ఇది నాకు చాలా సరదాగా ఉండేది..Continue reading “Software to Songs – కిట్టు విస్సాప్రగడ”

నిత్య సైనికుడు… భువనచంద్ర

నేను తమ్మిలేరు నదికి ఇవతల ఉండే కృష్ణాజిల్లాలో పుట్టాను. ఆ నదికి ఆవల పశ్చిమగోదావరి చింతలపూడిలో పెరిగాను. శ్రీకాకుళం, హైదరాబాదుల్లో చదువుకున్నాను. ఇక సైనికుడిగా మారాక… దేశమే నాదయ్యింది. నేను 18 ఏళ్లు వైమానిక దళంలో పనిచేశాను. ఒక దళంలో ఉండే ఆరు వందల మందీ ఒక్క కమాండుకి కచ్చితంగా పనిచేసేంత క్రమశిక్షణ మాకు అందించారు. మిలట్రీలో నేర్పే తొలి విషయం ఇదే! అందుకే ప్రతి దేశంలో… ఆరోగ్యవంతుడైన ప్రతి యువకుడినీ కనీసం అయిదేళ్లు మిలట్రీలో ఉంచాలిContinue reading “నిత్య సైనికుడు… భువనచంద్ర”