ఒక వయసొచ్చాక ‘ఇంక చేసేదేముంది లే’ అని రిలాక్స్ అయిపోతుంటారు చాలామంది. కొందరికి ఏదైనా సాధించాలని ఉన్నా, వాళ్లను వెనక్కిలాగే ప్రయత్నాలే ఎక్కువ జరుగుతుంటాయి. కానీ వయసును లెక్క చేయకుండా ‘బలమైన సంకల్పం ఉంటే, ఎలాంటి పనులైనా సాధ్యమని’ ముంబైకి చెందిన 66 ఏళ్ల పుష్పా భట్ నిరూపిస్తున్నారు. వయసును ఏమాత్రం పట్టించుకోకుండా, పరుగులో తనకంటూ ప్రత్యేక గర్తింపు తెచ్చుకుంటున్నారు. రానున్న సెప్టెంబర్ నెల 6న రెండోసారి కర్దూంగ్లా చాలెంజ్ లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులContinue reading “జీవితమనే పరుగుపోటీలో గెలుస్తున్న పుష్ప భట్!”
Category Archives: Uncategorized
ఓ విహారయాత్ర వాళ్ల జీవితాల్నే మార్చేసిందిSETU Foundation
వీకెండుకి అటు చివరో, ఇటు చివరో రెండురోజులు సెలవులొస్తే చాలు… కుటుంబం లేదా స్నేహితులతో విహారయత్రకు వెళ్లాలనుకుంటారు. కొందరైతే ఏడాదికోసారి తప్పనిసరిగా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. అలా కొందరు 2009 దీపావళి సందర్భంగా గుజరాత్ లోని ‘గుడ్ఖర్ వైల్డ్ లైఫ్ సాంక్చరీ’ చూసేందుకు వెళ్లారు. అయితే ఆ ప్రయాణం వాళ్లు ముందు ఊహించుకున్నట్లు జరగలేదు. అది వాళ్ల జీవితాలతో పాటు మరెంతో మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చింది. ‘సేతు’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు, దానిద్వారాContinue reading “ఓ విహారయాత్ర వాళ్ల జీవితాల్నే మార్చేసిందిSETU Foundation”
మనసు బాధగా ఉందా? మీకు మేమున్నాం!Vandrevala Foundation
డిప్రెషన్… యాంగ్జైటీ… స్ట్రెస్… ఇవన్నీ గుర్తించి తీరాల్సిన మానసిక ఆరోగ్య సమస్యలని చాలామంది ఈమధ్యే తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వీటికి సంబంధించి అవగాహన కల్పించేందుకు ఎంతోమంది వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అయితే పద్నాలుగేళ్ల క్రితమే, మనుషులు మానసిక సమస్యలతో ఎంత ఇబ్బంది పడతారో గ్రహించారు ముంబైకి చెందిన ప్రియా హిరానందని వండ్రేవల. చాలామంది తాము మానసిక ఆరోగ్య సమస్యతో ఇబ్బందిపడుతున్నామని తెలియకుండానే బాధపడుతుంటారని ఆమె కొన్ని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. దాంతో 2009లో వండ్రేవల ఫౌండేషన్Continue reading “మనసు బాధగా ఉందా? మీకు మేమున్నాం!Vandrevala Foundation”
ప్రజల దగ్గరకే ఆరోగ్యం!
మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. దాన్ని వందశాతం నమ్ముతారు తిరుపతికి చెందిన మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రముఖ న్యూరోలాజిస్ట్ డాక్టర్ బిందూ మీనన్. మెడిసిన్ చేయాలన్న కోరిక ఆమెలో కలగడానికి కారణం, ప్రజలకు సేవ చేయాలన్న ఆశే! అంతటి గొప్ప మనసుతోనే ఆమె డాక్టర్ బిందూ మీనన్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఎంతోమంది గ్రామీణ పేద ప్రజలకు నరాలకు సంబంధించిన ఎన్నో వ్యాధులపై అవగాహన కల్పిస్తూ,Continue reading “ప్రజల దగ్గరకే ఆరోగ్యం!”
యూట్యూబ్ ద్వారాలక్షల మందికి ఫ్రీ కోచింగ్
చదువుకోవాలనే తపన ఉన్నవాళ్లందరికీ మంచి శిక్షణ లభించే అవకాశాలు ఉండవు. కొందరికి ఆర్థిక పరిస్థితులు సహకరించపోతే, మరికొందరికి ఎక్కడ సరైన శిక్షణ తీసుకోవాలో అవగాహన ఉండదు. ఈ రెండింటితో ఇబ్బంది పడేవాళ్లకు తానున్నానంటూ ముందుకొచ్చాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన 32 ఏళ్ల అభినయ్. అభినయ్ మ్యాథ్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ద్వారా లక్షల మందికి ఉచితంగా వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్న పేద విద్యార్థులకు అభినయ్ పెద్దన్నలా అండగా ఉంటూ, వాళ్లContinue reading “యూట్యూబ్ ద్వారాలక్షల మందికి ఫ్రీ కోచింగ్”
వెయ్యేళ్లనాటి కళకు వైభవం!
అద్భుతమైన కళలకు పెట్టింది పేరు భారతదేశం. ఒక్కో రాష్ట్రంలో వివిధ రకాల కళలు వందల ఏళ్లక్రితమే ప్రాచుర్యం పొందాయి. వాటిలో కాలంతో పాటు కొన్నిరకాల కళలు అంతరించిపోవడం చూస్తున్నాం. కానీ కొంతమంది మాత్రం కనుమరుగవుతున్న కళలకు తిరిగి ప్రాణం పోయాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రకరకాల కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. అలాంటివాళ్లలో ముందువరుసలో ఉంటారు బెంగళూరుకు చెందిన ఆరతి హిరేమత్. కర్ణాటకకు చెందిన ప్రాచీన కళైన కసూతీని మళ్లీ వెలుగులోకి తీసుకొస్తున్నారామె. రకరకాల చీరల మీదContinue reading “వెయ్యేళ్లనాటి కళకు వైభవం!”
పిల్లల పాటిట పెద్దన్న – మనోజ్
చిన్నపిల్లల విషయంలో ఒక పొరపాటు లేదా నేరం జరిగితే, దానికి తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అభంశుభం తెలియని చిన్నారులు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అపహరణకు లోనవ్వడం దగ్గర్నించి లైంగిక వేధింపుల వరకు వాళ్లు. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ బాగోగులు చూసుకోవడం, వాళ్లకు రక్షణ కల్పించడం మనందరి బాధ్యత. ఇదే ఆలోచనతో ‘సొసైటీ ఫర్ చిల్డ్రన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒకటి, రెండు అని కాకుండా పిల్లలకు సంబంధించినContinue reading “పిల్లల పాటిట పెద్దన్న – మనోజ్”
పారేసిన చిప్స్ ప్యాకెట్లతో సన్ గ్లాసెస్!
ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. స్వచ్ఛమైన గాలి, నీళ్లు, ఆహారం… ఇలా అన్నింటినీ మనం ప్రకృతి నుంచే తీసుకుని ఆనందంగా జీవిస్తున్నాం. మరి మనవంతుగా ప్రకృతికి ఏం చేస్తున్నాం! దానికి మేలు చేయకపోగా, రకరకాల కాలుష్యాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ముఖ్యంగా మన జీవనవిధానంలో ప్లాస్టిక్ ఎప్పుడైతే ప్రవేశించిందో, అప్పుడే ప్రకృతికి హాని కలగడం ప్రారంభమైంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడకం వల్ల మనిషి మనుగడకే ప్రమాదంగా మారుతోంది. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు అంగీకరిస్తున్నారు. అందుకే కొంతమందిContinue reading “పారేసిన చిప్స్ ప్యాకెట్లతో సన్ గ్లాసెస్!”
అమ్మ ప్రేమలాంటి… తల్లిపాల కోసంబ్రెస్ట్ మిల్క్ బ్యాంక్!
తల్లి పాలు అమృతం అంటారు. అందులోని పోషకాలు బిడ్డ ఆరోగ్యానికి, ఎదుగుదలకు చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అంతటి ఆరోగ్యకరమైన పాలు తాగే అదృష్టం అందరికీ ఉండదు. ముఖ్యంగా పురిట్లోనే తల్లిని కోల్పోయిన బిడ్డలకు తల్లిపాలు కాకుండా డబ్బా పాలే ఆధారం అవుతున్నాయి. అలాంటి పిల్లలకు ఆరోగ్యకరమైన తల్లి పాలు అందిస్తే ఎంత బాగుంటుంది! ఆ ఆలోచనే మనసుకు ఎంతో హాయిగా ఉంది కదా.. అందుకే ఒక రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈContinue reading “అమ్మ ప్రేమలాంటి… తల్లిపాల కోసంబ్రెస్ట్ మిల్క్ బ్యాంక్!”
అంతరించి పోతుంది అనుకున్న పక్షి జాతి…పదిరెట్లు పెరిగింది. ఎలాగో తెలుసా ?
ఇక కొన్నేళ్లలో కనుమరుగు అయిపోతాయి అనుకున్న పక్షి జాతి సంఖ్య పది రెట్లు పెరిగింది. ఈ విజయం వెనకున్న వ్యక్తి డాక్టర్ పూర్ణిమా దేవి బర్మన్, వైల్డ్ లైఫ్ బయలాజిస్ట్. ‘గ్రేటర్ అడ్జుటాంట్ స్కార్క్’ చాలా అరుదైన పక్షి. దీన్ని మన దేశంలో హర్గిలా అని పిలుస్తారు. ఈ పక్షులను ‘ప్రకృతి పారిశుద్ధ్య సమూహం’గా భావిస్తారు. ఎందుకంటే ఇవి జంతు కళేబరాలు వంటివి తిని బతుకుతాయి. వీటి ముక్కు కత్తిలా పొడవుగా ఉంటుంది. తీక్షణమైన చూపులతో ఎంతContinue reading “అంతరించి పోతుంది అనుకున్న పక్షి జాతి…పదిరెట్లు పెరిగింది. ఎలాగో తెలుసా ?”