Design a site like this with WordPress.com
Get started

కూరగాయలు అమ్మకం నుంచి… వ్యాపారవేత్తగా!

ఒక వ్యక్తి విజయం సాధించాడంటే, ఆ ప్రయాణం అంత సులువుగా ఉండదు. ఎన్నో అడ్డంకులు, ఓటములు, ఒడిదుడుకులు తప్పకుండా ఉంటాయి. అలాంటి వాళ్లలో ముందు వరుసలోనే ఉంటాడు బిహార్ కు చెందిన 29 ఏళ్ల దిల్ఖుష్. ఒకటి కాదు.. రెండు కాదు! డ్రైవర్, ఎలక్ట్రీషియన్ లాంటి ఎన్నో పనులు చేసి అన్నింట్లోనూ నష్టమే చవిచూశాడు. అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. అయితేనేం! గుండె ధైర్యం, కఠిన శ్రమ, మంచి ఆలోచనతో ‘రోడ్ బెజ్’ అనే క్యాబ్ సర్వీస్ యాప్Continue reading “కూరగాయలు అమ్మకం నుంచి… వ్యాపారవేత్తగా!”

ఉచితంగా రాకెట్ లెర్నింగ్కలలకు రెక్కలు ఇస్తున్న సంస్థ!

పిల్లలను స్కూల్లో చేర్పించేకంటే ముందే ప్లే స్కూళ్లకు, అంగన్ వాడీలకు పంపించడం చూస్తుంటాం. ఈ పిల్లలకు ఏం నేర్పిస్తే బాగుంటుంది… వాళ్లకు ఏది అవసరమో గమనించి ఒక మంచి ప్రణాళికతో ముందుకొచ్చింది దిల్లీకి చెందిన రాకెట్ లర్నింగ్ అనే ఎడ్ టెక్ సంస్థ. అంగన్ వాడీ టీచర్లు, పిల్లల తల్లిదండ్రులకు మంచి కంటెంట్ తో తయారు చేసిన వీడియోలను వాట్సాప్ ద్వారా పంపించడంవల్ల అది ఎంతోమందిపై ప్రభావం చూపిస్తున్నట్లు రాకెట్ లర్నింగ్ టీమ్ చెప్తోంది. నిస్వార్థంగా పనిచేస్తున్నContinue reading “ఉచితంగా రాకెట్ లెర్నింగ్కలలకు రెక్కలు ఇస్తున్న సంస్థ!”

ఊరూరా లైబ్రరీ ఈ IAS ఆఫీసర్ లక్ష్యం…

పుస్తకాలు, విద్యార్థులకు పాఠాలతో పాటు సామాజిక బాధ్యతను నేర్పుతాయి. జీవితంలో చేరుకోవాలనుకునే గమ్యాలకు మార్గాన్ని చూపిస్తాయి. అయితే అలాంటి పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయా అంటే, అందుకు సమాధానం లేదనే చెప్పాలి. మారుమూల పల్లెల్లో… కొండకోనల్లో పిల్లలకు చదువుకోవాలని ఉన్నా, అందుకు తగ్గ సౌకర్యాలు ఉండవు. అలాంటివాళ్ల గురించి మంచి మనసుతో ఆలోచించారు ఉత్తరాఖాండ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ హిమాన్షు. తాను చదువుకోవడానికి పడ్డ కష్టం ఇతర విద్యార్థులు పడకూడదని వివిధ గ్రామాల్లో 16 లైబ్రరీలనుContinue reading “ఊరూరా లైబ్రరీ ఈ IAS ఆఫీసర్ లక్ష్యం…”

Earth Day Specialపిల్లల్ని కూడా భాగస్వాములు చేద్దాం!

నేడే ప్రపంచ ధరిత్రి దినోత్సవం. వరల్డ్ ఎర్త్ డే. మొదటిసారి ఈ ధరిత్రి దినోత్సవం 1970లో జరిగింది. భూమిని కాపాడుకోవాలన్నఉద్దేశ్యం ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఏప్రిల్ 22న ప్రపంచమంతా జరుపుకుంటోంది. అయితే ఒక్కో ఏడాది ఒక్కో థీమ్ ఉంటుంది. ఈ ఏడాది ధరిత్రి దినోత్సవం థీమ్ – ‘ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్’. భూమి గురించి, కాలుష్యం వల్ల ప్రకృతి ఎంత నాశనమవుతుందని మాట్లాడుకోవడం కాకుండా… దాన్ని రక్షించుకోవడానికి మనం ఏంContinue reading “Earth Day Specialపిల్లల్ని కూడా భాగస్వాములు చేద్దాం!”

ఇంటిలోపల కూడా పచ్చదనమే…The Green Decor Influencer!

లాక్ డౌన్ తర్వాత చాలామంది జీవనశైలి, అలవాట్లు, వ్యాపకాల్లో మార్పులు వచ్చేశాయి. కొంతమంది తమలోని ప్రతిభకు పదునుపెట్టి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లుగా మారారు. వీరిలో ఒకొక్కరు ఒకో అంశం, రంగాన్ని ఎంచుకోవడం చూస్తున్నాం. అలా ఇంటీరియర్ డెకర్ ముఖ్యంగా గ్రీన్ డెకర్ సబ్జెక్టుతో ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీ అయ్యారు హైదరాబాదుకు చెందిన ఇంజినీర్ షగున్ సూద్. ఇంటిని అలంకరించడాన్ని కొందరు అవసరంలా భావిస్తే, షగున్ లాంటి వాళ్లు ప్యాషన్ తో చేస్తారు. ఇంటిని శుభ్రంగా, అందంగాContinue reading “ఇంటిలోపల కూడా పచ్చదనమే…The Green Decor Influencer!”

18 ఏళ్ల కుర్రాడు…పాత సైకిల్ని సోలార్‌ బైక్ చేసేశాడు!

మన దేశంలోని యువత రోజురోజుకీ ఉన్నతస్థాయికి చేరుతోంది. చిన్న వయసులో గొప్ప ఆవిష్కరణలు చేస్తూ అందరి అభినందనలు చూరగొంటోంది. అంతేకాదు! పర్యావరణ కాలుష్యం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై యువతలో అవగాహన బాగా పెరుగుతోంది. దాంతో వాళ్లు తీసుకొస్తున్న ఆవిష్కరణలు వినూత్నంగా, ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇందుకు ఉదాహరణగా గుజరాత్ కు చెందిన 18 ఏళ్ల నీల్ షా గురించి చెప్పుకోవచ్చు. సైన్స్ పై ఉన్న ఆసక్తి, జనాలకు ఉపయోగపడే వస్తువు తయారు చేయాలన్న ఉత్సుకతతో నీల్, ఒక పాతContinue reading “18 ఏళ్ల కుర్రాడు…పాత సైకిల్ని సోలార్‌ బైక్ చేసేశాడు!”

కళలకు ప్రాణం పోస్తూ… రాష్ట్రానికి పేరు తెస్తూBIHART

కళలకు పెట్టింది పేరు మన దేశం. ముఖ్యంగా చేనేత కళలలకు ప్రసిద్ధి. ప్రతీ రాష్ట్రంలోనూ వివిధరకాల కళలు అనాదిగా ప్రాచుర్యం పొందాయి. అయితే మారుతున్న జీవన విధానం లాంటి కారణాల వల్ల కొన్ని కళలు మరుగున పడుతున్నాయి. కాకపోతే కళలను ప్రేమించే కొందరు వాటిని బతికించేందుకు నడుం బిగిస్తున్నారు. అలాంటి వాళ్లలో ఒకరే బిహార్ పాట్నాకు చెందిన 43 ఏళ్ల సుమతీ జాలన్. ‘బిహార్ట్’ పేరుతో జీరో వేస్ట్ క్లాతింగ్ బ్రాండ్ మొదలుపెట్టి బిహార్ రాష్ట్ర ప్రత్యేకContinue reading “కళలకు ప్రాణం పోస్తూ… రాష్ట్రానికి పేరు తెస్తూBIHART”

పిల్లల్ని గమనించుకునే స్మార్ట్ వాచ్

ప్రాణానికి ప్రాణంగా చూసుకునే పిల్లలు కొద్దిసేపు కళ్లముందు కనిపించకపోతేనే తల్లడిల్లిపోతుంటారు తల్లిదండ్రులు. అలాంటిది మనదేశంలో ప్రతిరోజూ ఎంతోమంది పిల్లలు తప్పిపోయి కన్నవాళ్లకు కడుపుకోతని మిగుల్చుతున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, మన దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి మిస్ అవుతున్నారట. దీనికి పరిష్కారంగా ఒక స్మార్ట్ వాచ్ ని తయారు చేశారు దిల్లీకి చెందిన గోయల్ దంపతులు. సేక్యో అనే స్టార్టప్ ద్వారా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులContinue reading “పిల్లల్ని గమనించుకునే స్మార్ట్ వాచ్”

ఇన్ స్టాగ్రాం లో సేంద్రియ వ్యవసాయం!

ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది ఒకప్పటి మాట కాదు… అలాగని ఇప్పటి మాట కాదు. కాలానికి అతీతంగా, ఎప్పటికీ అందరూ నమ్మాల్సిన మాట. ఎందుకంటే ఆరోగ్యం లేనప్పుడు ఎంత సాధించినా, సంతోషంగా ఉండలేరు. మరి అలాంటి ఆరోగ్యాన్ని కాపాడేదేంటి? అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది… మొదటి వరుసలో ఉండేది ఆహారం! మనం తీసుకునే ఆహారమే రేపటి మన ఆరోగ్య పరిస్థితిని నిర్ణయిస్తుందన్నది వాస్తవం. ఆహారం తీసుకోవడం వరకు సరే. కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అన్నది కూడా ముఖ్యమే. రసాయనాలతోContinue reading “ఇన్ స్టాగ్రాం లో సేంద్రియ వ్యవసాయం!”

ప్రాణాలు కాపాడుతున్న రెడ్‌ లైట్!

మనిషికి ప్రాణం విలువ, తమ మనసుకు దగ్గరైన వాళ్లు చనిపోయినప్పుడు ఎక్కువగా తెలుస్తుంది. ఏ కారణంగా తమవాళ్లు తమకు దూరమయ్యారో… అలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటారు. ఈ ఆలోచనను లక్ష్యంగా మార్చుకుని, ఓ అడుగు ముందుకేసి, నలుగురి క్షేమం కోసం పాటుపడుతున్న ఖుషి పాండే గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఖుషి పాండే ప్రతిరోజూ రోడ్ల మీదికి వచ్చి, కనిపించిన ప్రతి సైకిల్ కు రెడ్ లైట్ ను అమర్చుతోంది.Continue reading “ప్రాణాలు కాపాడుతున్న రెడ్‌ లైట్!”