రోజురోజుకూ అన్నిరకాల కాలుష్యాలూ పెరుగుతున్నాయన్నది వాస్తవం. ఆధునిక జీవనశైలిలో రసాయనాలు, ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా చలామణీ అవుతోంది. ఇదంతా మానవ మనుగడకే ప్రమాదమని శాస్త్రవేత్తలు, విద్యావంతులు చెబుతున్నా, పెద్దగా మార్పు కనిపించట్లేదు. కొంతమంది మాత్రం వాస్తవాన్ని గ్రహించి, తమవంతు బాధ్యతగా కొత్తకొత్త ఆవిష్కరణలు చేసి ‘ఔరా’ అనిపిస్తున్నారు. అందులో మొదటి వరుసలో ఉంటారు ఔరంగాబాదుకు చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు. వేలకొద్దీ వాడేసిన ప్లాస్టక్ బాటిళ్లు సేకరించి.. వాటిని ఉపయోగించి ఒక సస్టెయినబుల్ హోమ్ నిర్మించారు! ఔరంగాబాద్ లోనిContinue reading “ప్లాస్టిక్ బాటిళ్లతో, కళ్లు చెదిరే ఇల్లు”
Author Archives: touchaliferadio
తన ఆశయం – ఆకలి లేని ముంబై!
చదువు, ఉద్యోగం, సంపాదన బాగున్నప్పుడు జీవితం సంతోషంగా అనిపిస్తుంది. రోజూ నచ్చిన ఆహారాన్ని తినే స్తోమత ఉన్నప్పుడు జీవితం తృప్తిగా ఉంటుంది. కానీ ఆ చదువు, ఉన్నత కుటుంబం, మంచి జీతం, భరోసానిచ్చే ఉద్యోగం… ఇవేమీ వికాస్ ప్రచండకు సంతృప్తిని ఇవ్వలేదు. పట్టెడన్నం లేక ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు కడుపునింపడంతో అతనిలో అసంతృప్తి తొలగిపోయింది. లక్షల మందికి అన్నదానం చేయాలన్న ఆశయంతో ‘అక్షయ చైతన్య’ అనే గొప్ప కార్యక్రమానికి నాంది పలికాడు వికాస్. ‘‘నేను చదువుకునే రోజుల్లో…Continue reading “తన ఆశయం – ఆకలి లేని ముంబై!”
ఆటో నడుపుతూ… కూతుర్ని టెన్నిస్ ప్లేయర్ చేస్తున్నాడు!
ఒక తండ్రి ఆశయం.. ఒక కూతురి పట్టుదల… ఇప్పుడో సంచలన వార్తగా మారింది. అవును, కూతురు ప్రతిభను గుర్తించిన ఒక తండ్రి రెక్కలుముక్కలు చేసుకుని మరీ, కూతుర్ని ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని టెన్నిస్ అండర్-14 క్యాటగిరీలో నెంబర్ వన్ గా నిలిచిన తానియా సరాయ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడామె ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) జూనియర్ ర్యాంకింగ్ లో 1709 స్థానంలో ఉండటం గర్వించాల్సిన విషయం. రాజమండ్రికి చెందినContinue reading “ఆటో నడుపుతూ… కూతుర్ని టెన్నిస్ ప్లేయర్ చేస్తున్నాడు!”
ఖైదీల పిల్లలపై ప్రేమ.. తీసుకున్న బాధ్యత!
దంపతులిద్దరికీ స్పందించే మనసుంటే, సమాజానికి గొప్ప మేలే జరుగుతుంది. అందుకు ఉదాహరణగా బెంగళూరుకు చెందిన వి.మణి, సరోజల గురించి చెప్పుకోవచ్చు. చాలామంది సమాజం మీద బాధ్యతతో, అనాథలుగా మారిన పిల్లలపై ప్రేమతోనో ఎన్జీఓలు స్థాపిస్తారు. మరి ఈ దంపతులు స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎవరికోసమో తెలుసా? పిల్లల కోసమే! కాకపోతే తల్లిదండ్రులు ఉన్నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వాళ్ల కోసం. జైలు జీవితం గడుపుతున్న వాళ్ల పిల్లల కోసం! సమాజంలో ఈ పిల్లల పట్ల తీవ్రమైన వివక్షContinue reading “ఖైదీల పిల్లలపై ప్రేమ.. తీసుకున్న బాధ్యత!”
TAL Good News
అమ్మ మాటలు, హార్వర్డ్ పాఠాల కంటే గొప్పవి!
కరోనా సమయంలో అమెరికా నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నడిపినందుకు నేను చాలా మంది దీవెనలు నేను అందుకున్నాను. ఓ తల్లి… రవి నా కొడుకు అని దీవించారు! ఇప్పుడు మా అమ్మ లేరు కానీ అలాంటి దీవెనలు నాకు చాలా సంతోషం ఇస్తాయి. ఎందకంటే, నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మే! హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి పెద్ద సంస్థల్లో చదువుకోకపోయినా… మా అమ్మ, నాన్న నేర్పిన పాఠాలు చాలా విలువైనవని నేనుContinue reading “అమ్మ మాటలు, హార్వర్డ్ పాఠాల కంటే గొప్పవి!”
అల వచ్చినప్పుడు తల వంచుకోవాలి
ఎప్పుడైనా నా కథని రాయల్సి వస్తే సక్సెస్ స్టోరీ కాకుండా నా ఫెయిల్యూర్ స్టోరీ రాద్దామనుకుంటాను. ఎందుకంటే విజయం… పొగరును అలవాటు చేస్తుంది. మన విజయాన్ని అవతలివారు గుర్తించడం లేదన్న అసంతృప్తిని కూడా ఇస్తుంది. నిజమైన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కాబట్టే… నాకు జీవితకథలు చదవడం అంటే చాలా ఇష్టం. నిష్కర్షగా రాసిన జీవితకథలు ఎంతో నేర్పిస్తాయి. ఆదిభట్ల నారాయణదాసు జీవితకథనే తీసుకోండి. అన్ని కళల సమాహారం అయిన హరికథ ప్రక్రియకు పితామహుడే అయినా.. ఎంతోContinue reading “అల వచ్చినప్పుడు తల వంచుకోవాలి”
ప్రశ్నలు మీవే… జవాబులూ మీవే!
జీవితం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే… ఎప్పటికప్పుడు మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ పోవడమే! విజయం అంటే సాధికారికంగా నలుగురితో పంచుకోగలిగేది. నేను సంతోషంగా ఉంటే… ఆ సంతోషం మా అమ్మ కళ్లలో ప్రతిఫలిస్తుంది. ఇతరులకు వాళ్ల జీవితాలకు అర్థం వాళ్లు కనుగొనేలా చేయడం నా జీవితానికి అర్థంగా భావిస్తాను. ఇతరులకు వాళ్ల జీవితానందాన్ని కనుగొనేలా చేయడం… ఆ మార్గంలో వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేలా చేయడం… నా జీవిత లక్ష్యంగా భావిస్తాను. జీవితంలో సాధ్యమైనంతగా ఎక్కువ మందినిContinue reading “ప్రశ్నలు మీవే… జవాబులూ మీవే!”
ఒక వేణువై వినిపించెను
నా చిన్నతనం అంతా శ్రీకాకుళం జిల్లాలో తులగాం అనే ఊరిలో గడిచింది. నాన్నగారు పౌరాణిక ఆర్టిస్టు… చంద్రశేఖర నాయుడు గారు. ఆయన నుంచే నాకు సంగీతం అబ్బింది. ఆయనతో కలిసి నాటకాలు వేసేవారం. వాటిలో భాగంగా సంగీతాన్ని కూడా నిభాయించాల్సి వచ్చేది. అలా నాటకాలు, సంగీతంలో కెరీర్ ప్రారంభం అయింది. కానీ సినిమాల్లో పాడాలనే ఆశ మాత్రం అప్పట్లో ఉండేది కాదు. నేను పాడేది విని, అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఇంకా బాగా పాడాలి అనుకునేవాడిని. అంతే!Continue reading “ఒక వేణువై వినిపించెను”
Software to Songs – కిట్టు విస్సాప్రగడ
అమ్మమ్మ చూపిన పాటల బాట.. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ రోజుకో కథ చెప్పిపడుకోబెట్టేది. పిల్లలు కథ చెపితే ఊ కొట్టి నిద్రపోయేవారు. కానీ నేను అలా కాదు… ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అనేవాడిని. అప్పుడు అమ్మమ్మ ఆ కథను ఓ పాటలా పాడి వినిపించేది. అది నాకు బాగా నచ్చేది. అప్పటి నుంచి నేను కూడా కథలను పాటల్లా చెప్పేందుకు ప్రయత్నించేవాడిని. ఇది నాకు చాలా సరదాగా ఉండేది..Continue reading “Software to Songs – కిట్టు విస్సాప్రగడ”